తెలంగాణ

telangana

ETV Bharat / state

అశ్వత్థామరెడ్డిని అడ్డుకున్నారు.. విడిచి పెట్టారు - ts rtc strike

మహబూబాబాద్​లో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్​ నరేష్​ అంత్యక్రియలకు వెళ్తున్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డిని జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసుసు అడ్డుకున్నారు. తిరిగి హైదరాబాద్​ పంపే ప్రయత్నం చేశారు. కానీ మహబూబాబాద్​లో ఆందోళన చేస్తున్న కార్మికులు తమ నాయకుడు రానిదే అంత్యక్రియలు చేపట్టేది లేదని తేల్చిచెప్పడం వల్ల అశ్వత్థామరెడ్డిని విడిచి పెట్టారు.

అశ్వత్థామరెడ్డిని అడ్డుకున్నారు.. విడిచి పెట్టారు

By

Published : Nov 13, 2019, 6:57 PM IST

జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఆర్టీసీ ఐకాస నాయకుడు అశ్వత్థామరెడ్డిని జనగామ పోలీసులు అడ్డుకున్నారు. మహబూబాబాద్​లో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ నరేశ్​ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయనను తిరిగి హైదరాబాద్​కు తరలించేందుకు ప్రయత్నించారు. మహబూబాబాద్​లో ఆందోళన చేస్తున్న కార్మికులు తమ నాయకుడు రానిదే అంత్యక్రియలు జరిపేది లేదని పట్టు పట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అశ్వత్థామరెడ్డిని వదిలేశారు. 40 రోజులుగా సుదీర్ఘంగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకమన్నారు అశ్వత్థామరెడ్డి. నరేశ్​ ఆత్మస్థైర్యం దెబ్బతిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

అశ్వత్థామరెడ్డిని అడ్డుకున్నారు.. విడిచి పెట్టారు

ABOUT THE AUTHOR

...view details