జనగామ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలో భాగంగా తలపెట్టిన బంద్ ప్రశాంతంగా సాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలు మూసివేశారు. బస్సు డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది సహకారంతో బస్సులు నడిపే ప్రయత్నం చేశారు. నర్మెట్ట మండలం వెల్దండలో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. విపక్షపార్టీల నాయకులు, ప్రజా సంఘాలు నాయకులు ర్యాలీగా వచ్చి ఆర్టీసీ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
జనగామ జిల్లాలో బంద్ ప్రశాంతం - జనగామ జిల్లాలో బంద్ ప్రశాంతం
జనగామ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బస్సు డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులకు విపక్ష పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపారు.
జనగామ జిల్లాలో బంద్ ప్రశాంతం