టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి - today road accidents updates
టిప్పర్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జనగామ జిల్లా పటేల్‌గూడెంలో చోటుచేసుకుంది. నెలుట్లకు చెందిన వంశీ.. లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి
జనగామ జిల్లా పటేల్‌గూడెం వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. లింగాలఘనపూర్ మండలం నెలుట్ల గ్రామానికి చెందిన వంశీ.. నవాబుపేటలో పని నిమిత్తం వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. వెనక నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టగా అదే లారీ వెనక టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.