జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగరం గ్రామానికి చెందిన అర్జుల సంపత్ రెడ్డి రేషన్‌కార్డు దారులకు 5 కిలోల బియ్యం, కిలో పప్పు ధాన్యాన్ని పంపిణీ చేశారు. గ్రామంలో ఏ ఒక్కరు ఆకలితో బాధ పడకూడదని, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తన భార్యను సర్పంచ్‌గా గెలిపించిన ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామని భరోసానిచ్చారు.
మీరు గెలిపించారు.. మేం అండగా ఉంటాం - groceries to needy in jangaon
తన భార్యను ఏకగ్రీవ సర్పంచ్‌గా గెలిపించిన గ్రామస్థులను ఆదుకున్నారు జనగామ జిల్లా తరిగొప్పుల మండల అబ్దుల్ నాగారం గ్రామ నివాసి అర్జుల సంపత్ రెడ్డి. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
జనగామలో సరకుల పంపిణీ
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణకుమారి, ఎస్సై హరిత, జడ్పీటీసీ పద్మజ, ఎంపీపీ అరిత సుదర్శన్, సర్పంచ్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.