తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష కోట్లు దోచుకున్న దొంగ వైపు ఉంటారా? - ధర్మం వైపు ఉంటారా? : రేవంత్‌రెడ్డి

Revanth Reddy Speech in Jangaon Meeting Today : రాష్ట్రంలో దొరల పాలనకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతోందని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. జనగామలో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రేవంత్‌ ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Congress Election Campaign
Revanth Reddy Speech in Jangaon Meeting Today

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 8:07 PM IST

Revanth Reddy Speech in Jangaon Meeting Today :తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో జనగామ ప్రజలకు ప్రత్యేక స్థానముందని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. జనగామ గడ్డ.. కాంగ్రెస్‌ పార్టీ అడ్డా అని స్ఫష్టం చేశారు. కేసీఆర్‌(CM KCR) తనకు కట్టుబానిసల్లా ఉండే ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటున్నారని.. తన కాళ్ల దగ్గర పడి ఉండేవాళ్లనే గెలవాలని భావిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే - ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుంటా : రేవంత్‌రెడ్డి

Telangana Assembly Elections 2023 : విజయభేరి సభకు వచ్చిన జన సందోహాన్ని చూస్తుంటే.. కాలనాగుల పని పట్టడానికి పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్లుందని.. రేవంత్‌రెడ్డి అన్నారు. జనగామలో పల్లాను ఓడించి బొంద పెట్టడానికి వచ్చిన ప్రజలకు అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. పొన్నాల లేడని ఇక్కడ ఇబ్బంది జరుగుతదేమో అనుకున్నాని.. కానీ సభకు వచ్చిన ప్రజలను చూశాక ధైర్యం వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు.

కన్నతల్లి లాంటి పార్టీని, కార్యకర్తలను మోసం చేసినవారికి బండకేసి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి అక్రమాల గురించి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేశాడని.. వీళ్లిద్దరి బాగోతం గడీలో ఉన్న దొరకు తెలుసని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలోని మట్టికి ఒక పౌరుషం ఉందని.. దొరల రాజ్యంపై పోరాటం చేసి ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర ఈ ప్రాంతానిదని కొనియాడారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం : రేవంత్​రెడ్డి

Congress Election Campaign :పొన్నాల కేసీఆర్ పంచన చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా? అని రేవంత్‌ ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను మోసం చేసి.. పొన్నాల శత్రువు పంచన చేరాడని మండిపడ్డారు. అమెరికాలో మాట్లాడుకుని బీఆర్‌ఎస్‌లోకి చేరాడని విమర్శించారు. జనగామ ప్రజలు లక్ష కోట్లు దోచుకున్న దొంగ వైపు ఉంటారో.. ధర్మం వైపు ఉంటారో ఆలోచించాలన్నారు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్‌లోకి కాంట్రాక్టర్లకు తప్ప.. ఎవరికీ ప్రవేశం లేదని విమర్శించారు.

"ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఏంది.. లేకుంటే ఏంది? కేసీఆర్ ఉంటే మీకు వచ్చే పెన్షన్ రూ.2వేలు.. కేసీఆర్‌ను బొందపెడితే చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తాం. ప్రజా ప్రభుత్వంలో పేదలను ఆదుకునేందుకు సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీలను అమలు చేస్తాం. మాహిళలకు ప్రతీ నెల రూ.2500 అందిస్తాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేలు అందిస్తాం. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు, ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తాం". - రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

లక్ష కోట్లు దోచుకున్న దొంగ వైపు ఉంటారా.?- ధర్మం వైపు ఉంటారా.? : రేవంత్‌రెడ్డి

'ఇసుక మీద బ్యారేజీ కట్టడం వల్లే మేడిగడ్డ కుంగిపోయింది'

ABOUT THE AUTHOR

...view details