జనగామ జిల్లా నర్మెట్ట మండలం ఆగపేటలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి రోడ్డు వేయాలని రత్నతండా గ్రామస్థులు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. నర్మెట్ట మండలం రత్నతండా గ్రామస్థులు గత కొన్నేళ్లుగా తమ గ్రామానికి రోడ్డు వేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. వర్షాకాలం బురదతో ఇబ్బందులు పడుతున్నామని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెరాస ఎమ్మెల్యేకు చేదు అనుభవం... వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్థులు - ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వార్తలు
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి రోడ్డు వేయాలని ఎమ్మెల్యేను జనగామ జిల్లా నర్మెట్ట మండలం రత్నతండా గ్రామస్థులు నిలదీశారు. త్వరలో సమస్య పరిష్కరిస్తామని ముత్తిరెడ్డి తెలపటంతో గ్రామస్థులు శాంతించారు.
చేసేది ఏమి లేక మండలంలోని మచ్చుపహాడ్‌లో హరితహారం కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వాహనాన్ని ఆగపేట వద్ద అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు, తెరాస కార్యకర్తలకు స్వల్పంగా వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వారిని అడ్డు తప్పించే ప్రయత్నం చేశారు. గ్రామస్థులను తప్పించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే గన్మెన్లు కూడా వారిని తప్పించే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్థులు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరికి ఎమ్మెల్యే వాహనం దిగి సమస్య అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరలో సమస్య పరిష్కరిస్తామని చెప్పటంతో గొడవ సద్దుమణిగింది.
ఇదీ చదవండి:CM KCR Phone Call: హుజూరాబాద్‌పై కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. ఆడియో వైరల్