తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పలు విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్ కథలు, కవితలు, వ్యాసాల పోటీ నిర్వహించాయి. జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన రమేశ్ రచించిన 60 ఏళ్ల ఏడుపు అనే కథ ద్వితీయ స్థానం పొందింది. హైదరాబాద్ రాజ్ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా రూ. 10 వేల నగదు ప్రశంసా పత్రం అందుకున్నారు.
60 ఏళ్ల ఏడ్పు:
పారిశుద్ధ్య కార్మికుల జీవన స్థితిగతులపై 60 ఏళ్ల ఏడ్పు అనే కథ రాయడం దానికి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి రావడం ఆనందంగా ఉందని రమేశ్ తెలిపారు. ఈ కథ రాయడానికి ప్రేరణ ఇచ్చిన పారిశుద్ధ్య సిబ్బందికి అవార్డు అంకితమిస్తున్నట్లు వెల్లడించారు. సమాజాన్ని శుద్ధి చేస్తూ.. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా.. నిత్యం కాపాడుతున్న కార్మికుల కష్టాలను వివరించినట్లు తెలిపారు. కన్నీటి వెతలను 60 ఏళ్ల ఏడుపు అనే పేరుతో కథగా మలచినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి రావడం వల్ల ఎంపీపీ సరిత, సర్పంచ్ మానస, పీఎసీఎస్ ఛైర్మన్ నాగరాజు.. రమేశ్‌ను అభినందించారు.
ఇదీ చూడండి:భాగ్యనగరంలో మోగుతున్న కరోనా ఘంటిక