తెలంగాణ

telangana

ETV Bharat / state

నెల్లుట్లలో రోడ్డెక్కిన ఎంపీపీ, సర్పంచ్ - బెల్టుషాపులు మూసేయాలని కోరుతూ భారీ ర్యాలీ

జనగామ జిల్లా నెల్లుట్లలో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు భారీ ర్యాలీ చేపట్టారు. గ్రామంలో గొలుసుకట్టు దుకాణాలను నిషేధించామని... నిబంధన అతిక్రమించి మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజాప్రతినిధులు హెచ్చరించారు.

బెల్టుషాపులు మూసేయాలని కోరుతూ భారీ ర్యాలీ
బెల్టుషాపులు మూసేయాలని కోరుతూ భారీ ర్యాలీ

By

Published : Jun 7, 2020, 12:35 PM IST

బెల్టుషాపులు మూసేయాలని కోరుతూ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు జనగామ జిల్లా నెల్లుట్లలో భారీ ర్యాలీ చేపట్టారు. గొలుసుకట్టు దుకాణాలను నిషేధించామని... నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మితే రూ.50 వేల జరిమానా, క్రిమినల్‌ కేసులు తప్పవని ఎంపీపీ చిట్ల జయశ్రీ, సర్పంచ్ చిట్ల స్వరూపారాణి హెచ్చరించారు.

గ్రామాభివృద్ధి, కొవిడ్‌-19 నివారణ, బెల్టుషాపుల నిషేధం కోసం మహిళలు, యువకులు ఐక్యంగా సహకరించాలని కోరారు. పల్లెప్రగతి కోసం పారిశుద్ధ్య నియమాలు పాటించాలన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు అందరూ జాగ్రత్తలు పాటించాలి సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details