జనగామ జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)జిల్లా నిర్మాణ మహాసభలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని సమస్యలతో పాటు జిల్లాలోని సమస్యలు, అభివృద్ధిపై రావల్సిన నిధులు, పరిశ్రమలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రజాసమస్యలపై ఆందోళనలకు సిద్ధం - Communist Party of India (CPI) District Constituent Assembly in Janagama district center
జనగామ జిల్లా వ్యాప్తంగా సీపీఐ నిర్మాణాన్ని బలోపేతం చేసి ప్రజాసమస్యలపై ఆందోళనలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ప్రజాసమస్యలపై ఆందోళనలకు సిద్ధం