ముగిసిన తొలి విడత నామినేషన్ల పర్వం - mptc
మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా జనగామలోని నాలుగు మండలాల్లో నామినేషన్ల గడువు ముగిసింది. 4 జడ్పీటీసి స్థానాలకు 36 మంది, ఎంపీటీసీ స్థానాలకు 298 మంది నామపత్రాలు సమర్పించారు.
బుధవారంతో ముగిసిన నామినేషన్ల పర్వం
జనగామ జిల్లాలోని మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, లింగాలఘనపూర్ మండలాల్లో ఎన్నికలకు నామినేషన్లు గడువు బుధవారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు జడ్పీటీసి స్థానాలతోపాటు 49 ఎంపీటీసి స్థానాలకు నామినేషన్లు అధికారులు స్వీకరించారు. జడ్పీటీసి స్థానాలకు 36మంది, ఎంపీటీసీ స్థానాలకు 298 మంది నామపత్రాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.