జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా డీసీపీ శ్రీనివాస రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి యువకులు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం: డీసీపీ - Polices Blood Donation Camp held at Station Ghanapur latest news
రక్తదానం చేయడమంటే ప్రాణదానంతో సమానమని జనగామ డీసీపీ శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యవంతులు రక్తం దానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రక్షణ చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
![రక్తదానం ప్రాణదానంతో సమానం: డీసీపీ Blood Donation Camp held at Station Ghanapur in Janagama district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7722009-237-7722009-1592821685740.jpg)
రక్తదానం ప్రాణదానంతో సమానం
ప్రతి రోజూ ఎంతోమంది ప్రమాదాల బారినపడి సకాలంలో రక్తం లభించక మరణిస్తున్నారని డీసీపీ పేర్కొన్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసిన వారమవుతామని తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ సీఐ రాజిరెడ్డి, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.
TAGGED:
రక్తదానం ప్రాణదానంతో సమానం