జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని మాన్ సింగ్ తండా, బొత్తలపర్రె గ్రామాల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా గుడుంబాను అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 800 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేశారు.
అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తే జైలే - Police raids on Gudumba bases in Janagama district
లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలను మూసివేయటం వల్ల మందుబాబులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు గ్రామాల్లో గుడుంబాను అమ్ముతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి ఆటకట్టించారు.
![అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తే జైలే Police raids on Gudumba bases in Janagama district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6808025-707-6808025-1586972204843.jpg)
అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తే జైలే
అలాగే 60 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా నాటుసారా తయారీ, మద్యం విక్రయాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి... రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:-ఆ కరోనా మృతులంతా భోపాల్ దుర్ఘటన బాధితులే