లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు పడుతున్న కష్టాలు అందరికి తెలిసిందే. ప్రభుత్వం శ్రామిక్ రైళ్లు అందుబాటులోకి తెచ్చినా అవి జనగామ లాంటి ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల తమ స్వగ్రామానికి వెళ్లడానికి వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుర్తించిన పోలీసులు 44 మంది వలసకూలీలను పంపించేందుకు ఏర్పాటు చేశారు. అధికారుల అనుమతి తీసుకుని. చర్లపల్లి నుంచి బయలుదేరుతున్న శ్రామిక్ రైలులో ఎక్కించేందుకు ఏర్పాట్లు చేశారు.
వలస కార్మికులకు పోలీసులు సాయం - Corona virus
స్వస్థలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు పోలీసులు సాయం చేశారు. జనగామ నుంచి చర్లపల్లి వెళ్లేందుకు బస్సు ఏర్పాటు చేశారు. పోలీసులకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.

Police help to migrant labour
జనగామ నుంచి బస్సులో చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు తరలించారు. వారికి దారిలో తినడానికి అవసమయ్యే బిస్కెట్లు, అరటిపండ్లు, నీళ్ల బాటిళ్లతో పాటు, మాస్కులు, శానిటైజర్లను అందించి, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి పంపించారు. వలస కూలీలు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.