కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో జనగామ జిల్లాకేంద్రంలో నీరు వృథాగా పోతోంది. రోడ్డు విస్తరణ పనుల్లో పురపాలికలోని పైప్ లైన్ పగిలి రోడ్డుపైనే వరదలా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం... వృథాగా పోతున్న నీరు - జనగామలో పైప్ లైన్ లీక్
జనగామ జిల్లాకేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో గుత్తేదారు నిర్లక్ష్యం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. మున్సిపల్ పైప్ లైన్ పగిలి నీళ్లు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులకు సమస్యగా మారింది.
జనగామ జిల్లాకేంద్రంలో వృథాగా పోతున్న నీరు
అసలే వేసవికాలంలో నీటి వృథాను అరికట్టాల్సిన మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో మూడు సార్లు రోడ్డు మరమ్మతు పనుల పేరుతో గుత్తేదారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.