జనగామ జిల్లా మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని ఈసారి కాంగ్రెస్ కచ్చితంగా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఇంఛార్జీ అహ్మద్ మసూద్, కార్యకర్తలతో కలిసి సమీక్ష నిర్వహించారు. రూ. 30 కోట్లతో నగర అభివృద్ధి చేస్తున్న సర్కారు... భవనాలు కోల్పోయిన వారికి మాత్రం నష్ట పరిహారం చెల్లించడం లేదని విమర్శించారు. వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడినా... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు.
'జనగామ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం' - పొన్నాల లక్ష్మయ్య
జనగామ జిల్లా కేంద్రంలో రూ. 30 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్న ప్రభుత్వం విస్తరణలో భవనాలు కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇవ్వడం లేదని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు.
పొన్నాల లక్ష్మయ్య