జనగామ జిల్లా తరిగొప్పుల మండల తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు అసైన్డ్ పట్టాలను అందించారు. రైతులకు భూ సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జనగామలో ఇప్పటికి 96 శాతం భూ సమస్యలు పరిష్కారం అయ్యాయని వెల్లడించారు.
'రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా జనగామని మారుస్తా' - mla muthi reddy
జనగామలో 96 శాతం భూ సమస్యలు పరిష్కారమయ్యాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. త్వరలోనే మిగిలిన భూములు పూర్తి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు.
పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ