కని పెంచినవారే బరువయ్యారు... - తల్లిదండ్రులు
నవమాసాలు మోసి తల్లి జన్మనిస్తుంది...తన బిడ్డ ఆకలి తీర్చేందుకు రక్తాన్ని పాలుగా ఇస్తుంది. కడుపున పుట్టిన వారి కోసం తండ్రి అహర్నిశలు పని చేస్తుంటాడు. కొడుకు, కూతురు ప్రయోజకులైతే తాను ఆనందిస్తాడు. ఇటువంటి తల్లిదండ్రులను దయలేని కొడుకులు బయటకు గెంటేశారు.
మరో ఇంటికి అద్దె చెల్లించలేని పరిస్థితిలో వారు కొడుకులను ఆశ్రయించారు. వారు వెళ్లగొట్టడంతో వృద్ధ దంపతులు నెల రోజులుగా చిన్నకొడుకు ఇంటి ఆవరణలోనే ఉంటున్నారు. బయట ఉన్న అరుగులపైనే వంటగిన్నెలు, దుస్తులను భద్రపర్చుకున్నారు. ఆరుబయట మంచం వేసుకొని చలికి వణుకుతూ నిద్రిస్తున్నారు.
ఈ కుమారుల వ్యవహారంపై గ్రామస్థులు ఆగ్రహంతో ఉన్నారు. అవసాన దశలో ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు... కొన్ని రోజుల పాటు పోషించాలని పెద్ద కుమారుడు పరమేశ్‌కు తల్లిదండ్రులను అప్పగించారు.