తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడికి కృషి చేస్తున్న అందరికి ఎర్రబెల్లి కృతజ్ఞతలు - janagama latest news

కరోనా కట్టడికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు. జనగామ కలెక్టరేట్​లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

panchayathiraj minister errabelli dayakar rao on corona
'కరోనా కట్టడికి కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు'

By

Published : Apr 11, 2020, 7:04 PM IST

జనగామ కలెక్టరేట్​లో అధికారులు, ప్రజాప్రతినిధులతో పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలు, వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు.

విదేశాల నుంచి వచ్చిన 64 మందికి నెగిటివ్ వచ్చిందని, మర్కజ్ వెళ్లివచ్చిన 7గురిలో ఇద్దరికి మాత్రమే వైరస్​ సోకిందన్నారు. వారితో కలిసిన 116 మందికి కరోనా సోకలేదని తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాజయ్య, కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు.

'కరోనా కట్టడికి కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు'

ఇవీచూడండి:ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details