'చెట్లు నరికితే.. చట్టపరమైన చర్యలు' - collector nikhila visited kodavatoor illage
జనగామ జిల్లా కొడవటూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ నిఖిల తెలిపారు. గ్రామంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు.
'చెట్లు నరికితే.. చట్టపరమైన చర్యలు'
జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొడవటూరు గ్రామంలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొన్నారు. గత రెండు దఫాలుగా చేపట్టిన పల్లెప్రగతిలో గ్రామంలో పారిశుద్ధ్య పనులతో పాటు, మొక్కలు నాటడం, స్మశానవాటిక, డంపింగ్ యార్డ్ నిర్మాణం పనులు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఈసారి కార్యక్రమంలో పారిశుద్ధ్య పనులతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
Last Updated : Jun 1, 2020, 7:46 PM IST