"పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది" - zp chairman of janagama district
జనగామ జిల్లా పరిషత్ తొలి పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జడ్పీ ఛైర్మన్‌గా పాగాల సంపత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు.
"పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది"
జనగామ జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా పాగాల సంపత్‌రెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్‌గా భాగ్యలక్ష్మీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు. కొత్తపాలకవర్గాలపై బృహత్తర బాధ్యతలున్నాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు దక్కుతుందని హామీ ఇచ్చారు. నూతన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.
- ఇదీ చూడండి : మల్లన్నసాగర్ కేసులో అధికారులకు జరిమానా, జైలు