తెలంగాణ

telangana

ETV Bharat / state

గుమ్మడికాయ కాదిది.. వంకాయ! - మూడు కిలోల వంకాయ

జనగామ జిల్లాలో మూడు కిలోల బరువున్న వంకాయలు ఆకట్టుకుంటున్నాయి. చిల్పూరు మండలం వెంకటాద్రిపేటలోని ఓ రైతు తోటలో వంకాయలు ఇలా అధిక పరిమాణంలో కాసి గుమ్మడికాయలను తలపిస్తున్నాయి. చుట్టుపక్కల వాళ్లు.. తోటకొచ్చి భారీ సైజులో విరగకాసిన కాయలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అచ్చం గుమ్మడి కాయల్లాగా ఉన్న వంకాయలను చూసి ముచ్చటపడుతున్నారు.

overweight-brinjals-looks-like-pumpkin-in-jangaon
గుమ్మడికాయ కాదిది.. మూడు కిలోల వంకాయ!

By

Published : Mar 22, 2021, 8:43 AM IST

గుమ్మడికాయల్లా కనిపిస్తున్నా.. ఇవి వంకాయలే. వీటిలో కొన్ని 3 కిలోలకుపైగా బరువుంటాయి. జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేటకు చెందిన రైతు కేశిరెడ్డి సంపత్‌రెడ్డి కొన్నేళ్లుగా విత్తనాల కోసం ఈ వంకాయలను సాగు చేస్తున్నారు.

భారీ సైజులో వంకాయ

యంత్రాల ద్వారా విత్తనాలు తీసి దిల్లీకి, చైనాకు ఎగుమతి చేస్తుంటామని, తమకు కంపెనీలు క్వింటాకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు చెల్లిస్తాయన్నారు. ఇవి గులాబీ రకం వంకాయలని, సాధారణంగా పెద్ద పరిమాణంలోనే ఉంటాయని జనగామ జిల్లా ఉద్యానశాఖ అధికారిణి కె.ఆర్‌.లత తెలిపారు. సాగులో యాజమాన్య విధానాలు పాటించడంతో మరింత భారీగా కాశాయన్నారు.

ఇదీ చదవండి:పంటల బీమా సొమ్ము కోసం రైతుల నిరీక్షణ

ABOUT THE AUTHOR

...view details