ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు ప్రారంభించింది. 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు దూరదర్శన్, టీ షాట్ ద్వారా ఒక్కో తరగతి ఒక్కో సబ్జెక్టు బోధన సాగుతోంది. జనగామ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పాఠాలను కొంత మందే వింటున్నారు. విద్యార్థులకు పొలం పనులు ఉండటంతో సకాలంలో ఆన్లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నారు.
విద్యార్థులకు ఆన్లైన్ పాఠాల తిప్పలు - online clasess latest news
కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు ప్రారంభించింది. జనగామ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో టీవీలు లేని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వారిని పాఠశాలకు రప్పించి చరవాణి ద్వారా ఆన్లైన్ తరగతులు వినేలా చర్యలు తీసుకుంటున్నారు.
విద్యార్థులకు ఆన్లైన్ పాఠాల తిప్పలు
కొంత మంది విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలపై అవగాహన లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటికి వెళ్లి ఛానల్ పెట్టించి చూసేలా చేస్తున్నారు. టీవీలు, చరవాణులు లేని విద్యార్థులను పాఠశాలకు రప్పించి చరవాణి ద్వారా ఆన్లైన్ తరగతులు వినేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీచూడండి..టెక్నాలజీతో సామాన్యుల జీవితంలో మార్పులు తేవాలి: కేటీఆర్