కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ యువకుడు రిజర్వాయర్లో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పుప్పాల ఆనంద్ అనే యువకుడి ఇంట్లో తరచూ గొడవలు జరుతున్నాయని ఎప్పుడూ బాధపడుతుండేవాడు. నిన్న సాయంత్రం కూడా గొడవ జరిగిందని ఈ బాధలు భరించలేకే తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని వాట్సాప్లో స్నేహితులకు సందేశం పంపాడు. ఈ విషయాన్ని మిత్రులు అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా... జనగామ శివారులోని చిట్ట కోడూరు జలాశయం వద్ద ఆనంద్ ద్విచక్ర వాహనం, చారవాణి లభించింది. వెంటనే పోలీసులు జలాశయంలో గాలించగా మృతదేహం లభ్యమైంది.
యువకుడి ప్రాణం తీసిన కుటుంబ కలహాలు - MRUTHI
ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలే... ఆ బిడ్డను బలితీసుకున్నాయి. తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడుతున్నారని కుమారుడు జలాశయంలో దూకి బలవన్మరణం చేసుకున్నాడు.
యువకుడి ప్రాణం తీసిన కుటుంబ కలహాలు