దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రచారానికి జనగామ నుంచి వెళ్లిన వ్యక్తి కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. గురువారం నర్మెట్ట మండలం వెల్దండకు చెందిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేస్తే పాజిటివ్ రాగా, ఈరోజు జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది.
జనగామ జిల్లాలో మరో కరోనా కేసు - coronavirus news'
జనగామ జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రచారానికి హాజరైన మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు.
జనగామ జిల్లాలో మరో కరోనా కేసు
బాధితుడిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ తరలించారు. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులను గాంధీకి తరలించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మర్కజ్కి వెళ్లి.. వచ్చిన తర్వాత విధులకు హాజరై తోటి వారితో సన్నిహితంగా మెదిలి కరోనా వ్యాప్తికి కారణమైన ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
ఇవీచూడండి:ఒగ్గుకథ రూపంలో కరోనా అవగాహన