తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లింట విషాదం నింపిన రోడ్డు ప్రమాదం - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

శుభలేఖల పంపకాలు జరిగిపోయాయి. పచ్చని మామిడాకులతో ఇంటిని అలంకరించుకున్నారు. ఇతర సామగ్రిని సిద్ధం చేశారు. తెల్లారితే పెళ్లి హడావుడి.. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా మారింది. ఇంతలోనే ఆ ఇంటిని విషాదం ముంచెత్తింది. కూతురు పెళ్లి చూడకుండానే తండ్రిని రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది.

road accident at bachannapet mandal in janagoan district
పెళ్లింట విషాదం నింపిన రోడ్డు ప్రమాదం

By

Published : Mar 21, 2020, 10:49 AM IST

Updated : Mar 21, 2020, 10:57 AM IST

జనగామ జిల్లా బచ్చన్న పేట మండలం రామచంద్రాపూర్‌కు చెందిన బాలసిద్దులు పెళ్లి పనుల కోసం బచ్చన్నపేట వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిన ఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు.

పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో మరణవార్త బంధువులను కలిచివేసింది. ఈరోజు మృతుడి కుమార్తె పెళ్లి జరగాల్సి ఉండగా... అంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. పెళ్లి పెద్ద మృతితో... కుటుంబసభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

పెళ్లింట విషాదం నింపిన రోడ్డు ప్రమాదం

ఇవీచూడండి:జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రైళ్ల క్రమబద్ధీకరణ

Last Updated : Mar 21, 2020, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details