తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆకలి చావును తప్పించుకునే యత్నం.. స్వగ్రామానికి వెళ్తూ దుర్మరణం.. - road accident in janagama

ఉపాధి నిమిత్తం పెద్దపల్లి జిల్లా నుంచి హైదరాబాద్ వలస వచ్చాడు. లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇంకా ఇక్కడే ఉండి కుటుంబసభ్యులను ఆకలితో చంపకూడదని నిశ్చయించుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. దురదృష్టవశాత్తు వారు వెళ్తున్న వాహనం బోల్తా పడి ఆ ఇంటి పెద్దను మృత్యువు కబలించింది.

one man died in janagama road accident
బోల్తా కొట్టిన టాటా ఏసీ వాహనం.. వ్యక్తి మృతి

By

Published : Jun 8, 2020, 1:12 PM IST

పెద్దపల్లి జిల్లా జమ్మికుంట మండలం గోపాల్​పూర్​కు చెందిన సంపత్ రెడ్డి హైదరాబాద్​లో నివాసం ఉంటున్నాడు. లాక్​డౌన్ కారణంగా హైదరాబాద్​లో ఇబ్బందులు పడలేక ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సామాన్లను టాటా ఏసీ వాహనంలో వేసుకొని గోపాల్​పూర్​కు బయలుదేరాడు.

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్దకు చేరుకోగానే వాహనం డివైడర్​ను ఢీకొట్టింది. అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనం వెనుక భాగంలో సామాన్లతో పాటు ఉన్న సంపత్​ రెడ్డి కిందపడిపోయాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం ముందు భాగంలో కూర్చున్న కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:కరోనాపై పోరులో... స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష

ABOUT THE AUTHOR

...view details