కులాంతర వివాహం చేసుకున్నందుకు లక్ష రూపాయల జరిమానతో పాటు కుల బహిష్కరణ చేసిన ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొంతగట్టులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన డోకి బీరయ్య కుమార్తె వసంత.. వరంగల్‌కి చెందిన గట్టు అనిల్ కుమార్ గౌడ్లు ప్రేమించుకున్నారు. ఇరువురి పెద్దలను ఒప్పించి జూన్ 21న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. దీంతో కులపెద్దలు.. వసంత కుటుంబానికి లక్ష జరిమానా, కుల బహిష్కరణ విధించారు. తమకు న్యాయం చేయాలని కులపెద్దలు, సర్పంచ్ భర్త రాజయ్యపై పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది.
కులాంతర వివాహం చేసుకున్నందుకు లక్ష జరిమానా
కులాంతర వివాహం చేసుకున్న ఓ యువతికి, ఆమె కుటుంబానికి లక్ష జరిమానాతో పాటు కుల బహిష్కరణ చేశారు ఆ ఊరి పెద్దలు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి.
కులాంతర వివాహం చేసుకున్నందుకు లక్ష జరిమానా