జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన ప్రమీల (70) అనే వృద్ధురాలు నీళ్లు లేకుండా జీవనాన్ని సాగిస్తోంది. పది సంవత్సరాల నుంచి నీళ్లు తాగకుండానే గడిపేస్తోంది. ఇంట్లో వాళ్లు బతిమాలినా సరే.. వద్దు అంటూ తోసేస్తుంది. పదేళ్ల ముందు మంచిగానే నీళ్లు తాగేదానినని... తరువాత ఎందుకో నచ్చట్లేదని తెలిపింది. అప్పటి నుంచి నీటిని తాగకుండా... ఎంతటి ఎండలోనైనా సరే... చుక్కు నీరు కూడా తాగనని చెపుతోంది. నీళ్లు తాగకపోయినా తనలో ఏ మార్పు లేదని... ఇప్పటికి ఇంటి పనులు అన్ని చక్కదిద్దుతానని వృద్ధురాలు తెలిపింది.
ఈ అవ్వ పదేళ్లుగా నీళ్లు తాగట్లేదు.. కారణం అంతు చిక్కట్లేదు.! - జనగామ వార్తలు
తిండి లేకపోయినా కొందరు ఉండగలరేమో కానీ... నీళ్లు లేకుండా ఎవరూ ఉండలేరు. మనుషలకే కాదు... సకల ప్రాణకోటి నీటి మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ ఓ పెద్దావిడ మాత్రం నీళ్లు తాగకుండా రోజులు గడిపేస్తోంది. ఇంట్లో వాళ్లు బలవంతం చేసినా.. నీరు తాగేందుకు ససేమిరా అంటోంది.
పదేళ్లుగా ఆ వృద్ధురాలు నీళ్లు తాగట్లేదు.. కారణమేంటంటే..
బలవంతంగా నీరు తాగించే ప్రయత్నం చేస్తే... తాగినట్లు నటించి అనంతరం ఉమ్మేస్తోందని ఆమె భర్త తెలిపాడు. ఎవరు చెప్పినా తను వినట్లేదని... వైద్యులు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని వాపోతున్నాడు.
ఇదీ చూడండి:మేయర్ పీఠం దక్కకున్నా.. అభివృద్ధికి కృషి చేస్తాం: బండి