సప్తాహం పౌరాణిక నాటక ప్రదర్శనలు - jangoan
భాష సాంస్కృతిక శాఖ, చలనచిత్ర అభివృద్ధి సంస్థ సహకారంతో జనగామలో సప్తాహం పౌరాణిక నాటక ప్రదర్శనలు ప్రారంభించారు.
నాటక ప్రదర్శనలు
జనగామ జిల్లాలో రంగస్థల పౌరాణిక ద్వితీయ నాటకోత్సవాలను స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో సప్తాహం పౌరాణిక నాటక ప్రదర్శనల పేరుతో ప్రారంభించారు. పౌరాణిక నాటకాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని నాటక ప్రదర్శన సభాధ్యక్షులు నంద్యాల వైకుంఠం తెలిపారు. ఏడు రోజుల పాటు నిర్వహించే ఈ నాటకాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేస్తామని వెల్లడించారు.