జనగామ జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో నాగుల చవితి పండుగని బుధవారం వేడుకగా నిర్వహించారు. శివాలయాల్లో కార్తీక మాసోత్సవంలో భాగంగా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
నాగులమ్మకు వెండి, బంగారు పడగల సమర్పణ - జనగామ జిల్లాలో నాగుల చవితి వేడుకలు
జనగామ జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో నాగుల చవితిని బుధవారం వేడుకగా నిర్వహించారు.మహిళలు, చిన్నారులు పుట్టలో పాలు పోసి పూజలు చేశారు. వెండి,బంగారంతో చేసిన నాగ పడగలను సమర్పించారు.

జిల్లాలో ఘనంగా నాగుల చవితి వేడుకలు
భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. వెండి, బంగారంతో చేసిన నాగ పడగలను సమర్పించారు. తెల్లవారుజాము నుంచే మహిళలు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శివలింగానికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.
ఇవీ చదవండి: 'మీకు గుడిలోకి ప్రవేశంలేదు.. మీకోసం పూజలు చేయను'