తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు

ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు పోటెత్తారు. జిల్లాలోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 5 గంటల నుంచే బారులు తీరి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Mukkoti Ekadashi special pujas in janagama
వైభవంగా ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు

By

Published : Dec 25, 2020, 3:50 PM IST

ముక్కోటి ఏకాదశి వేడుకలు జనగామ జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల నిర్వాహకులు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెల్లవారుజాము నుంచే ..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే పూజలు మొదలయ్యాయి. భక్తులు ఉదయం 5 గంటల నుంచే బారులు తీరి తమ భక్తిప్రపత్తులను ప్రదర్శించారు. ప్రత్యేక పూజలు, ధనుర్మాస అర్చనలు, విష్ణు సహస్రనామార్చనలతో ఆలయాలు మారుమోగాయి.

ఇదీ చూడండి:రజినీకాంత్​కు అస్వస్థత..​ జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్

ABOUT THE AUTHOR

...view details