గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన భూములను తెరాస ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న మందకృష్ణ... రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం ఇందిరాగాంధీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ చేసిన భూములను స్వాధీనం చేసుకుంటున్నారని ఆక్షేపించారు.
'పేదల నుంచి లాక్కున్న భూములు తిరిగిచ్చేయాలి'
జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న రిలే నిరాహారదీక్షలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీల దగ్గర నుంచి లాక్కున్న భూములు తిరిగిచ్చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.
mrps leaders manda krishna fire om government
ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. జనగామ జిల్లా యశ్వంత్పూర్ వద్ద ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్ భూమిలో తెరాస పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని ఆరోపించారు. అంబేడ్కర్ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో మార్కెట్ యార్డ్ నిర్మించటం తగదని మందకృష్ణ హెచ్చరించారు.