దశాబ్దాల కాలంగా బూజుపట్టిన చట్టాలను తిరగరాస్తూ... పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్న ఘనత సీఎం కేసిఆర్ దేనని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో పలు మండలాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ. 21 లక్షల 6 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
'భవిష్యత్ తరాల కోసమే కొత్త సంస్కరణలు' - satosion ganpur news
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పర్యటించారు. పలు మండలాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ. 21 లక్షల 6 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
!['భవిష్యత్ తరాల కోసమే కొత్త సంస్కరణలు' mlc kadiyam srihari distributed cheques in stasionganpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8772802-461-8772802-1599893243361.jpg)
mlc kadiyam srihari distributed cheques in stasionganpur
మొన్న పంచాయతీ రాజ్ చట్టం... నిన్న మున్సిపల్ చట్టం... నేడు రెవెన్యూ చట్టం తీసుకువచ్చి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని కడియం తెలిపారు .ఐదేళ్ల కోసం వచ్చే రాజకీయాలను పక్కన పెడుతూ భవిష్యత్ తరాల కోసం అలుపెరుగని యోధునిలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. భూ తగాదాలకు శాశ్వతంగా స్వస్తి పలకాలని రాష్ట్రంలో గుంట భూమి కూడా పోకుండా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు.