తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా ఎమ్మెల్యే రాజయ్య పుట్టిన రోజు వేడుకలు - ఘనంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పుట్టిన రోజు వేడుకలు

జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై మండల కేంద్రంలో సందడి చేశారు.

MLA THATIKONDA RAJAIAH BIRTH DAY CELEBRATIONS
ఘనంగా ఎమ్మెల్యే రాజయ్య పుట్టిన రోజు వేడుకలు

By

Published : Mar 2, 2020, 5:50 PM IST

జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పుట్టిన రోజు వేడుకలను తెరాస కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు, కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే రాజయ్య కేక్​ కట్ చేశారు. డప్పు చప్పుళ్ల నడుమ కళాకారులు కోలాటం వేశారు. రోడ్డుపై టపాకాయలు పేల్చి ఎమ్మెల్యేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే పంచె కట్టులో మెరిశారు. అంతకుముందు ఉదయం హైదరాబాదులో మంత్రి కేటీఆర్​ను కలిశారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకున్నారు.

ఘనంగా ఎమ్మెల్యే రాజయ్య పుట్టిన రోజు వేడుకలు

ఇవీ చూడండి:భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details