జనగామ జిల్లాలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్టేషన్ ఘనపూర్ లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దల ఇళ్లకు వెళ్లిన రాజయ్య పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అల్లా దయతో ఉన్నతంగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
జనగామ జిల్లాలో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు - జనగామ జిల్లాలో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు.. భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ వేడుకలు నిర్వహించుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నందున ఈసారి ముస్లిం మత పెద్దలు ఈద్గాల వద్దకు వెళ్లకుండా.. తమ ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ముస్లిం మత పెద్దల ఇళ్లకు వెళ్లిన రాజయ్య పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జనగామ జిల్లాలో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
ముస్లిం సోదరులు ఉదయమే నూతన దుస్తులు ధరించి తమ కుటుంబ సభ్యులకు పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రతి ఇంట్లో ప్రత్యేక వంటకాలు, షీర్ - కుర్మా, బాదం తయారుచేసుకుని బంధుమిత్రులకు పంచుకున్నారు.
ఇదీ చూడండి: పండించిన పంటలకు.. రైతే మద్దతు ధర నిర్ణయించాలి..