పదో తరగతి పరీక్షలను సురక్షితంగా నిర్వహించాలని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సూచించారు. ఈ నెల నుంచి నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షల సందర్భంగా... విద్యార్థులకు పంపిణీ చేసేందుకు డీఈఓ యాదయ్యకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.
'పదో తరగతి పరీక్షలు సురక్షితంగా నిర్వహించాలి' - masks distribution to students
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు గానూ... జిల్లా విద్యాధికారికి ఎమ్మెల్యే రాజయ్య మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా పరీక్షల నిర్వాహణలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు.
!['పదో తరగతి పరీక్షలు సురక్షితంగా నిర్వహించాలి' mla rajaiah distributed masks and sanitizers to 10th class students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7488808-412-7488808-1591354729784.jpg)
'పదో తరగతి పరీక్షలు సురక్షితంగా నిర్వహించాలి'
కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా విద్యార్థులు భౌతిక దూరం పాటించే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు విధిగా మాస్కు ధరించి.. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని తెలిపారు.