తెలంగాణ

telangana

ETV Bharat / state

MLA Rajaiah viral video: చిన్నారులతో కలిసి బుల్లెట్​ బండి పాటకు స్టెప్పులేసిన తెరాస ఎమ్మెల్యే - viral news

జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్టలో అంబేడ్కర్​ విగ్రహ ఆవిష్కరణకు హాజరైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చిన్నారులతో కలిసి బుల్లెట్​ బండి (bullet bandi) పాటకు డ్యాన్స్​ చేశారు. కార్యక్రమ అనంతరం స్టేడిపైనే పిల్లలతో కలిసి కాలు కదిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

rajaiah
rajaiah

By

Published : Sep 5, 2021, 7:01 PM IST

చిన్నారులతో కలిసి బుల్లెట్​ బండి పాటకు స్టెప్పులేసిన తెరాస ఎమ్మెల్యే

ఈ మధ్యకాలంలో బుల్లెట్​ బండి పాట (bullet bandi song) ఎంతలా పాపులర్​ అయ్యిందో అందరికీ తెలిసిందే.. ఓ పెళ్లి వేడుకలో కాబోయేవాడిని మెప్పించడానికి వధువు వేసిన డ్యాన్స్​ సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపింది. ఇప్పుడు ఏ ఫంక్షన్​లో చూసిన బుల్లెట్​ బండి పాట లేదంటే అది ఫంక్షన్​ కాదేమో అన్నంతగా అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బుల్లెట్​ బండి పాట లేనిదే వేడుక లేదు. మాట తిరిగిన చిన్నారి మొదలు పండు ముసలి వరకు నాలుకపై బుల్లెట్​ పరుగులు పెడుతూనే ఉంది.

పెళ్లి వేడుకలు, ఆస్పత్రులు, ఇతర ఫంక్షన్లలో బుల్లెట్​ బండిపాటకున్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. ఇటీవల ఏదైనా వీడియో వైరల్​ అయ్యిందంటే... వెంటనే అందరికీ వచ్చే అనుమానం బుల్లెట్​ బండిపాటే అని.. మరి అంత క్రేజ్​ వచ్చింది ఈ పాటకు. తాజాగా ఈ పాటకు తన డ్యాన్​ను జతచేశారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.

జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రాజయ్య.. స్థానికంగా ఉన్న చిన్నారులతో కలిసి స్టేజిపైనే బుల్లెట్​ బండి పాటకు స్టెప్పులేశారు. సాక్ష్యాత్తు ఎమ్మెల్యే తమతో డ్యాన్స్​ చేస్తుండడంతో ఆనందంతో పిల్లలు కేరింతలు కొడతూ డ్యాన్స్​ చేశారు.

నియోజకవర్గంలోని చిల్పూర్​ మండలం పల్లగుట్టలో అంబేడ్కర్​ విగ్రహ ఆవిష్కర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజయ్య... కార్యక్రమ అనంతరం పిల్లలతో కలిసి స్టేజిపైనే స్టెప్పులు వేశారు. బుల్లెట్​ బండి పాటకు తనదైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. తమతో కలిసి ఎమ్మెల్యే డ్యాన్స్​ చేస్తుండడంతో చిన్నారుల ఆనందానికి అవధుల్లేవు.

ఇదీ చూడండి:MP Kavitha: బుల్లెట్ బండి పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ కవిత

ABOUT THE AUTHOR

...view details