రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప్పట్టిన 30రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరయ్యారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని ఆయన అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 30రోజులు ఒక యజ్ఞంలా కష్టపడి పని చేసి గ్రామాలను అభివృద్ధి పథంలోనికి తీసుకెళ్లాలని ముత్తిరెడ్డి తెలిపారు.
గ్రామాలను పరిశుభ్రంగా మార్చుదాం :ముత్తిరెడ్డి - గ్రామాభివృద్ధి ప్రణాళిక
జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరయ్యారు. గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
గ్రామాలను పరిశుభ్రంగా మార్చుదాం :ముత్తిరెడ్డి