తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే నృత్యం చేశారు.. ఆపై సవాల్ విసిరారు! - జనగామ జిల్లా తాజా వార్తలు

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నృత్యం చేశారు. ప్రజలతో మమేకమై సరదాగా స్టెప్పులేశారు. ఎమ్మెల్యే గారి ఆటకి అందరూ పరవశించిపోయారు. విజిల్స్​తో మరింత ఉత్సాహ పరిచారు. ఈ ఆసక్తికర సంఘటనకు పెద్దపహాడ్ వేదికైంది.

mla-muthireddy-yadagiri-reddy-inaugurated-the-rythu-vedika-in-janagama-district
ఎమ్మెల్యే నృత్యం చేశారు.. ఆపై సవాల్ విసిరారు!

By

Published : Feb 4, 2021, 2:24 PM IST

భాజపా నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ జిల్లా పెద్దపహాడ్​లో శాసన సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పర్యటించారు. అక్కడ నూతనంగా నిర్మించిన రైతువేదిక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి నృత్యాలు చేశారు. వారితో సరదాగా స్పెప్పులేశారు. ఊహించని ఈ పరిణామానికి ప్రజలు సంతోషించారు.

  • అర్ధనగ్నంగా తిరుగుతా: ముత్తిరెడ్డి

భాజపా నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆరోపించారు. కేంద్రం నిధులిస్తోందని, ఆ పార్టీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని అవన్నీ అవాస్తవాలేనని చెప్పారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి లక్షల కోట్లు జమ చేస్తున్నామని, కేంద్రం మాత్రం రాయితీలు ఇవ్వడంలేదని ఆరోపించారు. కేంద్రం నిధులిస్తోందని నిరూపిస్తే.. అర్ధనగ్నంగా తిరుగుతానని సవాల్ విసిరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులు ఆర్థిక ప్రగతి సాధించేందుకు రైతు వేదికలు దోహదం చేస్తాయన్నారు.

ఇదీ చదవండి: 'రూ.2 లక్షలు ఇవ్వండి.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాం'

ABOUT THE AUTHOR

...view details