MLA Muthireddy Comments : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓటు వేసే వారికే దళితబంధు పథకం అమలు చేస్తామని అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌కు ఓటేసిన వాళ్లకే దళిత బంధు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి - MLA Muthireddy Comments
MLA Muthireddy Comments : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓటు వేసే వారికే దళితబంధు పథకం అమలు చేస్తామంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎలాంటి దాపరికాలు లేవన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
రాంసాగర్ గ్రామ సర్పంచ్ రవీందర్ తమ గ్రామంలో దళితబంధు పథకం అమలు కావడం లేదని.. ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తెరాసకు, సీఎం కేసీఆర్‌కు ఓటు వేసే వారికే ఈ పథకం అమలు చేస్తామని.. ఇందులో ఎలాంటి దాపరికం లేదని యాదగిరిరెడ్డి బదులిచ్చారు. అలాంటి వారు ఉంటే ఒకరిద్దరి పేర్లు పంపించమని సర్పంచ్‌కు సూచించారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
'రాంసాగర్ నుంచి దళితబంధుకు ఒకటో రెండో ఉంటే పెడదాం. అర్హులెవరైనా ఉంటే.. తెలంగాణ సోయున్నోళ్లు.. అర్థమైంది కదా.. దాపరికం లేదు. ఎందుకుండాలి.. నీళ్లిస్తుండ్రు కదా.. అంతకుముందు నీళ్లు లేవు కదా.. కరెంటు లేకుండే కదా, ఎదిగిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు సర్కారు పైసలిస్తుంది కదా, గర్భిణులకు రూపాయి ఖర్చు లేకుండా ప్రసూతి చేస్తున్నం కదా, ఉల్టా పైసలు కూడా ఇస్తున్నం కదా.. ఇవన్నీ నష్టమా, లాభమా తెలంగాణకు.. అట్లా కాబట్టి ఆ సోయున్నోళ్లుంటే పెట్టియ్యి, ఆ సోయి లేకుంటే పెట్టకు, కేసీఆర్‌కే ఓట్లు వేస్తం, తెలంగాణనే గెలిపిస్తమన్నోళ్లుంటే పెట్టు, ఓపెన్ సీక్రెట్ ఇది.. దాపరికం లేదు.' - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఎమ్మెల్యే