MLA Muthireddy and his Daughter Controversy Update : నీతిగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలే తప్ప.. తన కుమార్తె, అల్లుడుని ప్రేరేపించడం మంచిది కాదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ బద్ధంగా తన బిడ్డను ఏమనలేక హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లోని నూతనంగా ఏర్పాటు చేసిన 134 వైద్య పరీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమాయకురాలైన తన కుమార్తెను అడ్డుపెట్టుకుని, అల్లుడిని ప్రేరేపించడం మంచిది కాదని అన్నారు. కష్టపడి జీవిస్తున్న తన బిడ్డను మూర్ఖులు రోడ్డుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
muthireddy yadagiri reddy land kabza : నీతిగా ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప.. ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేయరాదని చెప్పారు. ఎమ్మెల్యేకి, తన కుమార్తెకు మధ్య వివాదానికి కారణమైన భూమిలో తన కుమార్తె బిల్డింగ్ కట్టుకుంటానని చెప్పిందని పేర్కొన్నారు. తన కుమార్తెను తప్పుదోవ పెట్టి కొందరు వ్యక్తులు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రజాసేవకి భంగం కలగకుండా ఉండేందుకే హైకోర్టును ఆశ్రయించారని స్పష్టం చేశారు. తనని ప్రజాసేవ చేయమని హైకోర్టు ఆదేశించిందని అన్నారు.
MLA Muthireddy and his Daughter Controversy : కుమార్తె, అల్లుడిపై.. జనగామ ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్
అసలేం జరిగిందంటే..: ఎమ్మెల్యే కుమార్తె తుల్జా భవానీ రెడ్డి తన సంతకాన్ని.. తండ్రి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫోర్జరీ చేశారని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా చేర్యాలలో తన పేరిట ఉన్న భూమిని ఆయన పేరు మీదకు మార్చుకున్నారని పేర్కొన్నారు. ఇదే అంశంపై ముత్తిరెడ్డి స్పందించి వివరణ ఇచ్చారు. చేర్యాలలో 1200 గజాల భూమి తన కుమార్తె పేరు పైనే ఉందని.. ఎలాంటి ఫోర్జరీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. తన కుమార్తెని రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని తెల్చి చెప్పారు. తమ కుటుంబ సమస్యను ప్రత్యర్థులు పావుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. తన కుమార్తె, అల్లుడు ఆయన కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు. జూన్ 22న పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
"నా బిడ్డను రోడ్డుపాలు చేస్తున్న వారిని భగవంతుడు క్షమించడు, నా కుమార్తెను, అల్లుడుని ప్రేరిపించడం మంచిది కాదు. ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. రాజ్యాంగ బద్దంగా నా బిడ్డను ఏమనలేక హైకోర్టును ఆశ్రయించాను. కష్టపడి పని చేసుకుని జీవనం సాగిస్తున్న నా కుమార్తెను అడ్డుపెట్టుకుని నాపై గెలవాలనుకోడం అధర్మం. స్ధలం విషయంలో నా బిడ్డను కొందరు నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు." - ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
తన కుమార్తెను రోడ్డుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇవీ చదవండి :