జనగామ జిల్లా ఖిలాషాపూర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోట కూలిపోయిన భాగాన్ని టూరిజం, హెరిటేజ్ ఉన్నతాధికారులతో కలసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. కోట మరమ్మతులకు సీఎం కేసీఆర్ 1 కోటి 26 లక్షల రూపాయలను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.
సర్వాయి పాపన్న కోట మరమ్మతులకు రూ.1.26 కోట్లు - సర్దార్ సర్వాయి పాపన్న కోటను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
గతేడాది కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న సర్దార్ సర్వాయి పాపన్న కోటను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. కోట మరమ్మతులకు సీఎం కేసీఆర్ 1 కోటి 26 లక్షల రూపాయలను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.
సర్వాయి పాపన్న కోట మరమ్మతులకు రూ.1.26 కోట్లు
దీనికి సంబంధించిన జీవో ప్రతులను రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీ ఛైర్మన్ పల్లే లక్ష్మణ్ రావు గౌడ్, ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్‌కు మంత్రి అందించారు. 400 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన సర్దార్ సర్వాయి పాపన్న కోట గతేడాది కురిసిన భారీ వర్షాలతో కొంత భాగం కూలిపోయింది.
ఇదీ చూడండి: తుది అంకానికి యాదాద్రి పనులు.. త్వరలోనే పునః ప్రారంభం!
Last Updated : Jan 22, 2021, 4:44 PM IST