తెలంగాణ

telangana

ETV Bharat / state

srinivas goud: 'చెత్తకుప్పలు చూసి తట్ట ఎత్తిన శ్రీనివాస్​ గౌడ్' - మంత్రి శ్రీనివాస్ గౌడ్

srinivas goud: మంత్రిగారు వస్తున్నారంటే.. ఊరును ముస్తాబు చెస్తారు. చెత్తాచెదారం తొలగిస్తారు. మంత్రిగారి కళ్లకు అంతా అందంగా కనిపించేలా సిద్ధం చేస్తారు. అయితే జనగామ జిల్లాకు ఓ ఊరికి వచ్చిన శ్రీనివాస్​గౌడ్​కు చెత్త కుప్పలు దర్శనమిచ్చాయి. అంతే సర్పంచ్​పై కస్సుమన్న మంత్రి ఏకంగా తట్ట, పార తెప్పించి ఆయనే స్వయంగా చెత్త ఎత్తారు.

srinivas goud
శ్రీనివాస్​గౌడ్

By

Published : Jun 22, 2022, 5:00 PM IST

srinivas goud: పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తుంటే గ్రామంలో చెత్త కుప్పలు తొలగించక పోవడం ఏమిటని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిల షాపూర్లో సర్దార్ సర్వాయి పాపన్న కోట పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి గ్రామంలోని సర్వాయి పాపన్న, అంబేద్కర్, జగ్జీవన్ రాం విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో జగ్జీవన్ రాం విగ్రహం ముందు మురికి కాలువల నుంచి తొలగించిన వ్యర్థాలు కుప్పగా పోసి ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి వస్తున్నాడని తెలిసి కూడా తొలగించగా పోవడం ఏమిటని సర్పంచ్, కార్యదర్శులను ప్రశ్నించారు. తట్ట, పారాలను తెప్పించి స్వయంగా చెత్తను ఎత్తి పోశారు. మరోసారి ఇలా చేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీ సర్పంచ్ కావడంతోనే ఆగ్రహం వ్యక్తం చేశాడని స్థానికులు చర్చించుకున్నారు.

'చెత్తకుప్పలు చూసి తట్ట ఎత్తిన శ్రీనివాస్​ గౌడ్'

బాధితులకు ఇంటిస్థలం: అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న కోటలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను ఎమ్మెల్యే రాజయ్య, అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. త్వరలోనే కోటను బాగు చేసి వచ్చే సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను కోటలోనే ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కోట గోడ కూలిన ఘటనలో ఇల్లు కోల్పోయిన బాధితులకు త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లను కేటయిస్తామని తెలిపారు. కానీ బాధితులు అవి మాకు ఎప్పుడూ వస్తాయో తెలియదని మాకు స్థలం కేటాయిస్తే సొంత పైసలతో ఇల్లు నిర్మించుకుంటామని మంత్రికి తెలపడంతో వారం రోజుల్లో స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details