జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలు రాజయ్య, యాదగిరి రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఆనాటి రాజులు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి 33 కోటలను జయించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు.
బహుజన వీరుడు సర్వాయి పాపన్న: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - janagama district latest news
ఆనాటి రాజులు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి 33 కోటలను జయంచిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యేలు రాజయ్య, యాదగిరి రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
బహుజన వీరుడు సర్వాయి పాపన్న: మంత్రి శ్రీనివాస్ గౌడ్
బ్రిటిష్ వాళ్లు లండన్ యూనివర్సిటీలో పాపన్న గౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించారన్నారు. పాపన్న చరిత్రను కొందరు నిర్లక్ష్యం చేశారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్రను గుర్తించి భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా 7వ తరగతి పాఠ్యపుస్తకాల్లో నమోదు చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు.
ఇవీచూడండి:జనాభా లెక్కలు ఈ ఏడాది లేనట్టే!