జనగామ జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని జరుగుతున్న కార్యక్రమాలను ఏ విధంగా జరుగుతున్నాయో కాలనీల్లో తిరుగుతూ ఇంటిఇంటికి వెళ్లి మహిళలతో, వృద్ధులతో ముచ్చటించారు. సరైన సమయానికి చెత్తను తీసుకొని వెళ్తున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు.
'ఏం బాబూ.. జీతాలు సమయానికి అందుతున్నాయా?' - Minister Ktr latest updates
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ జనగామ జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించిన మంత్రి సమయానికి జీతాలు వస్తున్నాయో లేదోనని ఆరా తీశారు.
!['ఏం బాబూ.. జీతాలు సమయానికి అందుతున్నాయా?' Minister Ktr asks municipal employees about their salaries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6213318-thumbnail-3x2-df.jpg)
'ఏం బాబు.. జీతాలు సమయానికి అందుతున్నాయా'
'ఏం బాబు.. జీతాలు సమయానికి అందుతున్నాయా'
పారిశుధ్య కార్మికులను కలిసి వారితో మాట్లాడి.. జీతాలు సరిగ్గా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. బూట్లు, చేతులకు గ్లోవ్స్ వేసుకుని పనిచేయాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.
ఇవీ చూడండి:దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు!