తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంట్లోనే రంజాన్ చేసుకోండి: ఎర్రబెల్లి' - నిత్యావసరాల పంపిణీ

కరోనా కష్టకాలంలో రంజాన్ మాసం వచ్చిందని... పండుగను ఇంట్లోనే జరుపుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు సూచించారు. పాలకుర్తిలో చెక్కుల పంపిణీ చేసిన ఆయన అందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

minister-errbelli-dayakar-rao-about-ramzan-festival-in-janagoan
'పండుగను ఇంట్లో ఉండే చేసుకోండి'

By

Published : May 22, 2020, 5:48 PM IST

రంజాన్ పండుగ సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మంత్రి ఎర్రబెల్లి. అనంతరం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధీదారులకు చెక్కులను అందించారు.

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కష్టకాలంలో రంజాన్ పండుగ వచ్చిందని... కాబట్టి పండుగను ఎవరింట్లో వారే చేసుకోవాలని సూచించారు. దూరం పాటిస్తూ... జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు.

ఇవీ చూడండి:కార్పొరేటర్​ దంపతులకు జరిమానా వేసిన కేటీఆర్... ఎందుకంటే..?

ABOUT THE AUTHOR

...view details