ప్రజల్లో అవగాహన కల్పించి, కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. కరోనా వైరస్ అదుపు, ఆరో విడత హరితహారం, ఉపాధి హామీ నిధుల వినియోగంపై జనగామ కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వీయ నియంత్రణ, హోం క్వారంటైన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అనుమానతులను హోం క్వారంటైన్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు.
కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: ఎర్రబెల్లి - హరితహారంపై ఎర్రబెల్లి సమీక్ష
కరోనా వైరస్ నియంత్రణ, ఆరో విడత హరితహారంపై జనగామ కలెక్టరేట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉపాధిహామీ నిధులు మరింత ఉపయోగించుకోవాలని సూచించారు.
![కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: ఎర్రబెల్లి minister errabelli review on harithaharam in janagama collecterate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7720735-549-7720735-1592815145366.jpg)
ఉపాధి హామీ నిధులు వినియోగించుకొని, గ్రామాల్లో కల్లాలు నిర్మితమయ్యేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉపాధిహామీని సాగు నీటిపారుదల శాఖకు అనుసంధానం చేయడం వల్ల... రైతులకు మరింత ఉపయోగపడుతుందన్నారు. ఆరో విడత హరితహారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో అలసత్వం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సమావేశంలో కలెక్టర్ నిఖిల, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'మోదీజీ.. రాజీ వద్దు- ఐకమత్యంగా ఎదుర్కొందాం'