తెలంగాణ

telangana

ETV Bharat / state

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు తాజా వార్తలు

జనగామ జిల్లా పెద్ద మాడుర్‌లోని చెక్‌ డ్యాం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పూజలు చేశారు. శుక్రవారం కురిసిన వర్షంతో అలుగు పారడం వల్ల రైతులతో ఆనందం పంచుకున్నారు. అనంతరం ఆయన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటారు.

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి
పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి

By

Published : Jul 4, 2020, 10:07 PM IST

శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్ద మాడుర్‌లోని వాగుపై నిర్మించిన చెక్‌ డ్యాం అలుగు పారింది. ఆ చెక్‌ డ్యాం వద్దకు చేరుకుని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరిశీలించారు.

గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ చల్లి మంత్రి పూజలు చేశారు. రైతులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం తన జన్మదిన సందర్భంగా అక్కడ ఎర్రబెల్లి దయాకర్‌ రావు మొక్కలు నాటారు.

చెక్​ డ్యాం వద్ద మంత్రి ఎర్రబెల్లి పూజలు

ఇదీ చూడండి:బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details