హరిత తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పేర్కొన్నారు. జనగామ జిల్లాలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. చెట్లను సమృద్ధిగా పెంచితేనే వర్షాలు కురుస్తాయని చెప్పారు. 230 కోట్ల మొక్కలు నాటాలన్నదే కేసీఆర్ లక్ష్యమని... ఆరో విడతలో 30 కోట్ల మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమానికి గ్రామపంచాయతీ నుంచి 10 శాతం నిధులు వాడుకోవచ్చని తెలిపారు.
230 కోట్ల మొక్కలు నాటాలన్నదే కేసీఆర్ లక్ష్యం: మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. మంత్రితో పాటుగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు.
230 కోట్ల మొక్కలు నాటాలన్నదే కేసీఆర్ లక్ష్యం: మంత్రి ఎర్రబెల్లి