ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా తెరాస పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ కార్యాలయాల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని మంత్రి తెలిపారు. త్వరలోనే జనగామ, ములుగు జిల్లాల్లో నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయా పార్టీ కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు.
తెరాస కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి - minister errabelli inspecting trs office construction in janagaon
జనగామ జిల్లాలో నిర్మితమవుతున్న తెరాస పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా పార్టీ కార్యాలయాల భవనాల నిర్మాణం పూర్తవుతుందని.. వాటిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని మంత్రి పేర్కొన్నారు.
![తెరాస కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి minister errabelli at janagaon](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8298929-947-8298929-1596598314572.jpg)
తెరాస కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లాలో నిర్మాణ పనులు జరుగుతున్న తెరాస కార్యాలయ భవనాన్ని మంత్రి దయాకర్రావు పరిశీలించారు. ఈ భవనాలు ప్రారంభమైతే.. పార్టీ కార్యకలాపాలన్నీ అందులోనే జరుపుకునే వీలుంటుందన్నారు. పార్టీ కార్యాలయాలను సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు.